Today (03-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం మాదిరిగానే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. ముఖ్యమైన రెండు సూచీలు కూడా ఊగిసలాట ధోరణ ప్రదర్శించాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బయ్యర్లను ఆకర్షించగా రిలయెన్స్ మరియు ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 50 పాయింట్లు పెరిగి 61 వేల 200 వద్దకు చేరింది.
Today (30-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ఈ ఏడాది చిట్టచివరి ట్రేడింగ్ సెషన్ జరిగింది. రేపు శనివారం స్టాక్ మార్కెట్‌కి సెలవు కావటంతో ఈ రోజు శుక్రవారమే 2022కి లాస్ట్ ట్రేడిండ్ డే అయింది. ఇవాళ రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా కొనసాగాయి. కొద్దిసేపు లాభాల్లోకి.. మరికొద్దిసేపు నష్టాల్లోకి జారుకుంటూ ఊగిసలాట ప్రదర్శించాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ చివరికి నష్టాల్లో ముగిశాయి.