West Bengal: పోలింగ్ రోజున సీబీఐ రైడ్స్‌పై సీఈవోకి టీఎంసీ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే పశ్చిమబెంగాల్‌లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే.. ఇంకోవైపు సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులకు తెగబడింది. ఈ పరిణామాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికలు జరుగుతుండగా సీబీఐ రైడ్స్ చేయడాన్ని తప్పుపడుతూ.. రెండు పేజీల లేఖతో పశ్చిమబెంగాల్ ఎన్నికల అధికారికి టీఎంసీ ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: Congress: ‘‘ముస్లిం ఓట్లు కావాలి కానీ, అభ్యర్థులు వద్దా..?’’ కాంగ్రెస్‌ని ప్రశ్నించిన మైనారిటీ నేత..
Also Read
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
శుక్రవారం సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్ బంధువు ఇంట్లో సీబీఐ దాడులు చేసింది. కేంద్ర భద్రతా బలగాల సాయంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఈ దాడుల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అనేక బాంబుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే సీబీఐ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. పేలుడుపదార్థాలను గుర్తించేందుకు బాంబు స్కానింగ్ పరికరాలను కూడా తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే సందేశ్‌ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌పై మహిళలు ఆరోపించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. వీరికి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సపోర్టుగా నిలిచారు. మొత్తానికి కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 55 రోజుల తర్వాత షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక హైకోర్టు తీరుపై కూడా మమత సర్కార్ గుర్రుగా ఉంది. సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో కూడా టీఎంసీ సర్కార్ పిటిషన్ వేసింది.
ఇది కూడా చదవండి: Pensions Distribution: ఇంటింటికి పెన్షన్ల పంపిణీ.. సీఎస్‌కు ఈసీ ఆదేశాలు.
ఇక పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను పరామర్శించారు. వారి బాధలను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బాధిత మహిళకు బీజేపీ టికెట్ కూడా ఇచ్చింది.
TMC writes to the West Bengal Chief Electoral Officer complaining against the CBI for conducting a raid in Sandeshkhali on election day. pic.twitter.com/e4xLeBpC9j
— ANI (@ANI) April 27, 2024
తాజావార్తలు
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!