Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒకరి భూమిని మరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పత్రాల దందా గుట్టు రట్టయింది. బాధిత రైతు నెక్కలపూడి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు పట్టణ పరిధిలోని రాజుపేట రెవెన్యూ గ్రామంలో గల ఆర్ఎస్ నెంబర్ 126/2, 126/4, 126/5 లోని తన భూములపై గతంలో వివాదాలు నడిచాయి. దీనిపై ఆయన తిరువూరు సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయస్థానం 2006లోనే శ్రీనివాసరావుకు అనుకూలంగా పర్మనెంట్ ఇంజంక్షన్ (శాశ్వత స్టే) ఆర్డర్ ఇస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం గుంజి సరవయ్య కుమారులు ఆ భూముల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు.
తహశీల్దార్, వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ..
కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ, గుంజి సరవయ్య కుమారులు చట్టాన్ని ఉల్లంఘించారు. ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉన్నట్లు అబద్ధపు సాక్ష్యాలను సిద్ధం చేశారు. మోదుగు ప్రసన్న అనే డాక్యుమెంట్ రైటర్ సహాయంతో అప్పటి తిరువూరు తహశీల్దార్ ప్రకాష్ బాబు, రాజుపేట వీఆర్ఓ సిహెచ్. గోపాలకృష్ణల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లను సృష్టించారు.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు..
ఈ ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల కళ్లు గప్పి గుంజా కృష్ణయ్య, నాగరాజు, శ్రీను, జమలయ్య, కేశవులు తదితరుల పేర్లపై 6825/2025 నుండి 6848/2025 వరకు గల ఐదు వేర్వేరు డాక్యుమెంట్ల ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో సదరు వ్యక్తులు ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించిన తరుణంలో అసలు విషయం బయటపడింది.
పీజీఆర్ఎస్ లో బాధితుడి ఫిర్యాదు..
తన భూమి అక్రమంగా చేతులు మారిందని తెలుసుకున్న బాధితుడు శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించిన నిందితులపై, సహకరించిన డాక్యుమెంట్ రైటర్‌పై కఠిన చర్యలు తీసుకుని, తన భూమిని తనకు దక్కేలా న్యాయం చేయాలని బాధితుడు లబోదిబోమంటూ అధికారులను వేడుకున్నాడు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?