Dowry Harassment: అదనపు కట్నం.. మరో మహిళను చిదిమేసింది. తమిళనాడులోని తిరుప్పూరులో పెళ్లైన 2 నెలలకే వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం చెందింది. వరకట్న నిషేధ చట్టం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా.. అరాచకాలు మాత్రం ఆగటం లేదు. అదీ చదువుకున్న వాళ్లు.. బాగా ఆస్తి, ఐశ్యర్యంతో సెటిల్ అయినవాళ్లు కట్నం కోసం వేధించి చంపేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. తమిళనాడులో తాజాగా అలాంటి ఘటనే జరిగింది.…