Tirupati: విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినోద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
GITAM University: గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసి అడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.
Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) BNS సెక్షన్ల కింద క్రైం నెంబర్ (Cr. No. 23/2026) కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో A1గా సతీష్, A2గా మోహన్ బాబు, A3గా మంచు విష్ణు బాబుపై కేసు నమోదు చేశారు. మొత్తంగా ప్రధాన నిందితులతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..