Vaikunta Dwara Darshan Tokens: సామాన్యులకు అధిక ప్రాధాన్యం: టీటీడీ ఈవో
- జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
- కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు
- మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు.
జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మిగిలిన తేదీలకు ఒకరోజు ముందుగా జారీ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని సూచించారు. టోకెన్లు లేని భక్తులకు పది రోజుల పాటు శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు.
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
- Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
- Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వైకుంఠ ఏకాదశి కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో క్యూలైన్లు, బారీకేడ్లు పెడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. టోకెన్ల కోసం వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సర్వదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు తమకు కేటాయించిన సమయానికి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహా అధికారులు బుధవారం తనిఖీ చేశారు.
తాజావార్తలు
-
Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో