కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం…