Tirumala TTD: వెంకన్న స్వామి భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు కట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం నాడు హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం టిటిడికి లభించింది. స్వామివారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వారికి 20 గంటలకు పైన సమయం పడుతుంది.
దీంతో భక్తులు అసౌకర్యం గురి కాకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీరు, పాలు, అల్పాహారం లాంటి వాటిని టీటీడీ భక్తులకు అధికారులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి సిఫారసు లేకలను కూడా స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఈ రూల్స్ తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఈ రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కేవలం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండనుంది. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలంటూ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు