కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం…