కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం సమయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయంలో నేటి నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది టీటీడీ. అయితే.. బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా తెల్లవారు జామున 5:30 గంటలకు ఆరంభం అయ్యే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 8 గంటలకు మార్చారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
Also Read : ICC: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బౌలర్ జాబితాలో లేని టీమిండియా ఆటగాళ్లు
అలాగే భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఉదయం 8 గంటలకు అనుమతిస్తారు.. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులకు ముందుగా అనుమతి ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను.. అనంతరం టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ విధానాన్ని నెలరోజుల పాటూ పరిశీలించి ఇలాగే కొనసాగించాలా.. లేని పక్షంలో పాత పద్ధతినే అమలుచేయాలా అని నిర్ణయం తీసుకోనుంది టీటీడీ.
Also Read : MLC Kavitha: మోడీ వచ్చే ముందు ED రావడం సహజం.. జైల్లో పెడతాం అంటే బయపడం!