మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మరో హిట్ ను అందుకున్నాడు.. కానీ ఆ తరువాత వచ్చిన రావణాసుర సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ రివీలైంది. మూడు గంటల ఒక నిమిషం రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రన్‌టైమ్ పరంగా రవితేజ కెరీర్‌లోనే టైగర్ నాగేశ్వరరావు పెద్ద సినిమా కావడం విశేషం. రీసెంట్ టైమ్‌లో తెలుగులో రిలీజైన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా (మూడు గంటల ఏడు నిమిషాలు) అలాగే అర్జున్‌రెడ్డి (మూడు గంటల రెండు నిమిషాలు) తర్వాత ఎక్కువ రన్‌టైమ్ కలిగిన మూవీగా టైగర్ నాగేశ్వరరావు నిలిచింది.పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు.
1970 -80 దశకంలో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన స్టూవర్ట్‌పురం కి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్‌గా టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియన్ లెవెల్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌తో రవితేజ ఎంతో బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా తరువాత రవితేజ గోపీచంద్ మలినేనితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.