ఏపీలోని పలు జిల్లాల్లో కాసేపట్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ పిడుగుల ప్రమాదం పొంచివుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించాడు. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇవాళ ( ఆదివారం ) కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్ని ఐఎండి ప్రకటించింది.
Also Read : Chhattisgarh : కోడిగుడ్ల కోసం హోటల్ ఓనర్ కిడ్నాప్
ఉభయ గోదావరి జిల్లాలో పాగు కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తామని హెచ్చరించారు. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగుల పడే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిచంది. ఇక గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అలాగే ఎండల తీవ్రత కూడా పెరిగిపోయి వేడిగాలులు వీస్తున్నాయి. ఇలా రెండు రకాల వాతావరణ పరిస్థితులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదిలా ఉండే రానున్న ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత తక్కువగా ఉండనుందని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడనుందని తెలిపింది. దీంతో ప్రజలు ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
Also Read : IPL 2023: IPL 2023: సీఎస్కేతో కోల్‌కతా బిగ్ ఫైట్.. ఉత్కంఠ పోరులో గెలిచేది ఎవరు?