KKR vs CSK : ఐపీఎల్ లో ఇవాళ హైటెన్షన్ మ్యాచ్ జరుగనుంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్ ల్లో ఎనిమిది పాయింట్లతో స్టాండింగ్‌లో మూడో స్థానంలో ఉండగా, కోల్‌కతా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సొంత మైదానంలో గెలిచిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వెసుకునేందుకు ప్లాన్ చేసింది. మరోవైపు, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా తమ గత మ్యాచ్ ను ఓడిపోయింది. అయితే కోల్ కతా మాత్రం సీఎస్కేపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది.
Also Read : IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో పోటీకి సై అంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ బ్యాటర్‌కు అనుకూలమైనది. అయితే ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అటువంటి ఈ పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయం అని నిపుణులు అంటున్నారు. IPL 2023లో డెవాన్ కాన్వే వేగంగా తన ఫామ్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లలో 258 పరుగులు చేసి మంచి ప్రారంభం అందించాడు. అతను గత మ్యాచ్ లో అజేయంగా 77 పరుగులతో నిలిచాడు. కాన్వే రాబోయే మ్యాచ్‌లో మరో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నారు. భారత వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైకి తమ గత మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు. హైదరాబాద్‌పై నాలుగు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రాబోయే మ్యాచ్ లో కూడా ఇలాంటి ప్రదర్శనలను జడేజా నుంచి సీఎస్కే ఆశిస్తుంది.
Also Read : Amrit Pal Singh : ఎట్టకేలకు చిక్కాడు.. అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు
జట్ల అంచనా :
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్ (wk), వెంకటేష్ అయ్యర్, N జగదీసన్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (c & wk), మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్