థ్రిల్లర్ మూవీస్ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా విడుదలవుతు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. తాజాగా ఇప్పుడు మరో సినిమా ఓటీటిలోకి రాబోతుంది.. వైభవ్, నందితా శ్వేత జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇప్పుడు ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది..
ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. థియేటర్లలో పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
కథ పాతగానే ఉన్న డైరెక్టర్ కొత్తగా చూపించాడు.. సిరియల్ కిల్లర్ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు షరీఫ్ తెరకెక్కించారు.. నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కూడా కనిపించింది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.. ఆ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నారో ఈ సినిమాలో చూపించారు.. అక్కడ చూడనివాళ్లు ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి..