టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు ముగ్గురు ఎమ్మెల్సీలు. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. మా రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశాం. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని మర్రి రాజశేఖర్ తెలిపారు.
Also Read:India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్‌తో రక్షణ ఒప్పందంపై భారత్..
నేను మార్చ్ 19 న ఎమ్మెల్సీ కి రాజీనామా చేసానన్నారు. పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే టీడీపీ లో చేర్చుకుంటాం అని చెప్పారు. 6 నెలలు అయింది.. మా రాజీనామాలు మండలి చైర్మన్ ఆమోదించలేదన్నారు. మండలి చైర్మన్ వెనక ఉండి నడిపించే వారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదన్నారు. ఆమోదిస్తారని నమ్మకం లేదు.. సీఎం చంద్రబాబు నాయకత్వం లో పాలన బావుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు బాగా తీసుకుంటున్నారు.. అమరావతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు లోకేష్ బాగా కృషి చేస్తున్నారు. మా సహాయం కూడా అందించాలని టీడీపీ లో చేరామని తెలిపారు.
సోమవారం మండలికి వెళ్తాము డిస్ క్వాలిఫై చేస్తారో.. రాజీనామా అమోదిస్తారో చూద్దాం.. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. తిరిగి టీడీపీ సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి 13 నెలలు అయింది. మా రాజీనామాలు ఆపి…ఆమోదించకుండా.. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తోంది.. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వాములు అవ్వడం కోసం టీడీపీ లో చేరామని తెలిపారు.
Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్, బెంగళూరుతో సహా ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నేను 2024 ఆగస్ట్ 30 న రాజీనామా చేసాను.. ఏడాది పాటు నా రాజీనామ ఆమోదించలేదు.. ప్రజలకు ఎలాంటి సేవ చేయలేకపోయాము.. ప్రజల అభివృద్ధి కోసం ముందడుగు వేసే వారే లీడర్. రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వామ్యం కోసం. టీడీపీ లో చేరామని అన్నారు.