రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దర్యాప్తు నివేదిక వచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ పరేడ్‌కు హాజరు కావాలని ఆర్సీబీ ప్రేక్షకులను ఆహ్వానించిందని నివేదిక పేర్కొంది. జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కు ముందు ఈ తొక్కిసలాట జరిగింది. విక్టరీ పరేడ్‌లో 11 మంది మరణించారు. అదే సమయంలో, 50…
RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఇతరులపై FIR నమోదు చేశారు పోలీసులు. FIRలో నేరపూరిత హత్య వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్…
మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంది. విధానసౌధ ప్రాంగణంలో ఆర్సీబీ క్రికెటర్లను సన్మానించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో.. టీమ్ బస్సు సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకుంది. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య…
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. ప్రజలు తమ క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్‌షోను…
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా…