NTV Telugu Site icon

IND vs PAK: పాకిస్థాన్‌ టీమ్లో ఆ ముగ్గురు డేంజర్..!

Danger

Danger

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే ఈ జట్లు తలపడుతున్నప్పుడు చూడటమంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. కానీ స్టేడియంలో లైవ్ చూడాల్సిందేనంటూ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా ప్రత్యర్థి టీంను ఓడించాలనే కసితో ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాక్ జట్టులో ఆ ముగ్గురు ఉన్నంత వరకు ప్రమాదకరమని.. వారితో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని పలువురు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో చూద్దాం.

Read Also: TS DSC Exam: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా

బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో పెద్దగా ఏమీ రాణించలేదు. నెదర్లాండ్స్, శ్రీలంకతో ఆడిన మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన చూపించినప్పటికీ.. ఇండియాతో మాత్రం చెలరేగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకే బాబర్ ఆజంను ఎంత తొందరగా ఔట్ చేస్తే ఇండియాకు అంత మంచిది. ఈ బ్యాట్స్ మెన్ క్రీజులో ఉన్నంతసేపు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉంది.

షాహీన్ షా ఆఫ్రిది
పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది.. తొలి ఓవర్‌లోనే వికెట్లు తీయడంలో నిపుణుడు. తొలి ఓవర్లనే వికెట్లు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ షాహీన్‌కు బౌలింగ్ పట్ల ఆచితూచి ఆడాలి. స్పీడ్‌తో స్వింగ్ చేయడంలో నిష్ణాతుడైన షాహీన్.. 2023 ఆసియాకప్‌లో లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై విధ్వంసం సృష్టించాడు. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో కూడా అద్భుతాలు చేయగలడు.

మహ్మద్ రిజ్వాన్
శ్రీలంకపై 131 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడి పాకిస్థాన్‌ను చారిత్రాత్మక విజయానికి దారితీసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్.. భారత్‌పై కూడా రిజ్వాన్ కు మంచిపట్టు ఉంది. రిజ్వాన్ ప్రతి బంతికి పరుగులు చేయడంలో పేరుగాంచాడు. రిజ్వాన్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు కష్టమే. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో జరిగిన రెండు మ్యాచ్ ల్లో రిజ్వాన్.. 199 పరుగులు చేశాడు. అందుకే రిజ్వాన్ కూడా ఎంతతొందర పెవిలియన్ కు పంపితే అంత మంచిదని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.