ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నుండి టోర్నమెంట్‌లోని 10 జట్లు మొత్తం ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలా మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. విడుదలైన వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు అరటి తోటలో పనికి వెళ్ళారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై పిడుగు పడింది. దీంతో.. పిడుగుపాటుకు గురై సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (19) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే ఈ జట్లు తలపడుతున్నప్పుడు చూడటమంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. కానీ స్టేడియంలో లైవ్ చూడాల్సిందేనంటూ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా ప్రత్యర్థి టీంను ఓడించాలనే కసితో ఇరు…
యోగా చేస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని చెబుతుండగా.. ముఖ్యంగా మూడు యోగాసనాలు రోజూ వేయడం ద్వారా గుండె జబ్బుల బారినపడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఆ యోగాసానాలు ఏంటంటే.. ఉత్థిత త్రికోణాసనం, పశ్చిమోత్తానాసనం, అర్ధ మత్య్సేంద్రాసనం.