యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు .బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో ,రాధేశ్యాం ,ఆది పురుష్ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా తెరకెక్కాయి.కానీ ఆ సినిమాలు ప్రభాస్ కు నిరాశనే మిగిల్చాయి.గత ఏడాది ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్” సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండవ పార్ట్ “శౌర్యంగ పర్వము” త్వరలోనే రిలీజ్ కానుంది .ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి” .ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది .
ఈ సినిమాను మొదట మే 9 న విడుదల చేయాలనీ భావించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది .జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు .ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు .త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు .అలాగే డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా “రాజా సాబ్” మూవీ తెరకెక్కుతుంది .త్వరలోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .ఇదిలా ఉంటే ప్రభాస్ ,సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో “స్పిరిట్ ” అనే మూవీలో నటిస్తున్నాడు.త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది .దీనితో ఇతర దర్శకులు ప్రభాస్ కోసం రెండేళ్ల వరకు ఆగాల్సిందే..