టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒక్కటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టీజర్ ఎంతలా సంచలనం రేపింది అంతా చూసే ఉంటారు. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని, నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్‌గా వాడటం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగుతున్నాయి. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఈ మూవీలో నాని లుక్ ఒక్కసారిగా అందర్నీ అవకయేలా చేసింది.
Also Read : Ram : యంగ్ డైరెక్టర్ తో రామ్ పోతినేని..?
రెండు జడలతో నాని లుక్ రివీల్ చేసిన విధానం అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఇంత గోరమైన మేకోవర్‌లో నానినీ చూపించడానికి కారణం ఏమై ఉందా అని ఫ్యాన్స్‌లో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ రెండు జడల వెనుక ఉన్న రహస్యం బయట పెట్టాడు.
‘మీరు అనుకున్నట్లుగా ఈ రెండు జడల వెనుక బలమైన కారణం ఉంది. నా చిన్నప్పుడు అయిదేళ్ల వయసు వరకు మా అమ్మ నన్ను అలాగే పెంచింది, ఆ స్ఫూర్తితోనే ప్యారడైజ్ లోని నాని పాత్రను డిజైన్ చేశాను. ఈ రెండు జడలకు నా బాల్యానికి కనెక్షన్ ఉంది. ప్రస్తుతానికి ఇంత కన్నా డీటెయిల్స్ చెప్పలేను. షూటింగ్ మొదలయ్యాక సందర్భాన్ని బట్టి పంచుకుంటాను ఇక్కడితో ఆ టాపిక్‌ని ముగిస్తే మంచిది’ అంటూ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.