టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా, ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తూ, హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ ఎనర్జిటిక్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరీర్ గ్రాఫ్, ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిపోయింది. యాక్షన్ మూవీస్ తో బ్యాక్ బ్యాక్ అలరిస్తున్నప్పటికి హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. చివరిగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వరుస చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు.
Also Read: Ram Charan : RC16 నుంచి జాన్వీ రోల్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్.. !
ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో రామ్ ఓ క్లీన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అన్నీ మాస్ సినిమాలే చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు మళ్ళీ అతనికి సూటయ్యే క్లాస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి, రామ్ క్యారెక్టర్ లుక్ ఆ మధ్య విడుదల కాగా, సినిమా పై మంచి అంచనాలు ఏర్పడాయి. ఇక ఇప్పుడు రామ్‌కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
ఏంటి అంటే తాజాగా రామ్, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘హిట్’ మూవీతో యూనివర్స్‌ని పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను, రామ్ కోసం ఓ మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్రాక్ లోకి తీసుకురానున్నట్లు టాక్. ఇక సినిమాపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.