బిగ్ బాస్ సీజన్ 6 అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఈసారి బుల్లితెరతో పాటు వెండితెరలోనూ పాపులారిటీని సంపాదించుకున్న కొందరు నటీనటులను ఎంపిక చేయడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 3లో తొలిసారి నిజజీవితంలోనూ భార్యాభర్తలైన, నటీనటులు రితికా సేరు, వరుణ్ సందేశ్ పాల్గొన్నారు. ఇప్పుడు లాంటి ఛాన్స్ మరో రియల్ లైఫ్ జంటకు లభించింది. వాళ్ళే రోహిత్, మరీనా! వీళ్ళిద్దరూ బుల్లితెర వీక్షకులకు సుపరిచితులే! ‘అమెరికా అమ్మాయి, ప్రేమ’ సీరియల్స్ లో మరీనా నటించగా, ‘నీలికలువలు, అభిలాష’ సీరియల్స్ లో రోహిత్ నటించాడు. విశేషం ఏమంటే… వీరిద్దరూ కలిసి ఓ సినిమాలోనూ హీరోహీరోయిన్లుగా నటించారట. అయితే అదింకా విడుదల కాలేదని నాగార్జునతో చెప్పారు సిల్వర్ స్క్రీన్ కపుల్!
ఇక వీరిద్దరూ కాకుండా బిగ్ బాస్ 6 సీజన్ లో మరో జంట కూడా ఉంది. అయితే అది రియల్ లైఫ్ పెయిర్ కాదు… కేవలం సిల్వర్ స్క్రీన్ పెయిర్. వాళ్ళే అర్జున్ కళ్యాణ్, వాసంతి కృష్ణన్. వీరిద్దరూ కలిసి ‘అడ్డతీగల’ అనే సినిమాలో జంటగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. సో… ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రియల్ కపుల్ అండ్ రీల్ కపుల్ కూడా ఉన్నారు. మరి వీరిలో ఎవరు? ఎప్పుడు? హౌస్ నుండి బయటకు వస్తారన్నది వేచి చూడాల్సిందే!