తమిళ స్టార్ హీరో ధనుష్ , స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రాంబలం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాది ఆగస్టులో విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. తిరుచిత్రాంబలం సినిమాకు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ధనుష్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రాశీ ఖన్నా, భారతీ రాజ, ప్రకాశ్ రాజ్, ప్రియా భవానీ శంకర్, మునిశ్‍కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.తెలుగులో ‘తిరు’ పేరు తో ఈ సినిమా రిలీజ్ అయింది.. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, తిరుచిత్రాంబలం (తిరు) సినిమా గతంలోనే సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు మరో ఓటీటీ ప్లాట్‍పామ్‍లోకి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.తిరుచిత్రాంబలం సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేసింది.
ఇండియాతో పాటు గ్లోబల్‍గా దాదాపు 240 దేశాల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తెచ్చినట్టు అమెజాన్ ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల ఆడియోల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమా కథ విషయానికి వస్తే..ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేసే తిరు అలియాజ్ పండు (ధనుష్ ), శోభన (నిత్యామీనన్) చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉంటారు. అయితే, తిరు అమ్మాయిలను ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తారు. అయితే, అన్నీ బ్రేకప్స్ అవుతుంటాయి. మరోవైపు తిరును ఇష్టపడుతున్నా.. ఆ విషయాన్ని శోభన బయటికి చెప్పదు. ఇంకోవైపు తన తండ్రి (ప్రకాశ్ రాజ్)తో తరచూ గొడవ పడుతుంటాడు తిరు. ఇక తిరు, శోభన ఎలా ఒక్కటయ్యారు అనేది కథ.. ఈ సినిమాలో ధనుష్,నిత్యామీనన్ యాక్టింగ్ అదిరిపోయింది.. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ యువతను బాగా ఆకట్టుకుంది.