కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి…. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్ కి చెందిన మేకలను ఈరోజు కుక్క లు ఉదయం దాడి చేసి చంపేసాయి….గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను,కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి… అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. తాజాగా మరోసారి కుక్కలు దాడి చేసి మేకల ను చంపేశాయి.
దీంతో కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు యువకుడు నిరసనకు దిగారు… ఇప్పటివరకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన మేకలను తాను వేటకుక్కల దాటిలో కోల్పోయానని అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని అన్నారు…. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించగా ఆయన సైతం యువకుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కుక్కలు దాడీ చేస్తే మాకేం సంబంధం అంటున్నారని అధికారుల తీరు పై తప్పు పడుతున్నారు.. గతంలో కూడా ఇదే యువకుడు గతంలో జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు. గతం లో కుక్కలు కోళ్ల పై దాడి చేశాయి. చనిపోయిన కోడిని మున్సిపల్ ఆఫీస్ కి కట్టారు.. తనకు నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు..