టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత పెరిగింది. ఆటో మొబైల్ కంపెనీలు బైకులు, కార్లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో బైకులను కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు మైలేజ్ లేదా స్టైల్‌ను మాత్రమే కాకుండా, భద్రతా ఫీచర్లపై కూడా దృష్టి పెడుతున్నారు. ఈ రోజుల్లో బైకుల్లో అనేక రకాల భద్రతా లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి టెక్నాలజీ. గతంలో ఇది ఖరీదైన బైక్‌లలో మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ బైక్‌లలో కూడా ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. మరి బడ్జెట్ ధరలో ఏబీఎస్ ఫీచర్ తో వచ్చే బైకుల వివరాలు మీకోసం..
Also Read:Posani Krishna Murali: పోసానికి హైకోర్టులో ఊరట.. విచారణ అధికారికి నోటీసులు..
టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2వి
ABS ఉన్న స్పోర్టీ, శక్తివంతమైన బైక్ కోరుకుంటే, Apache RTR 160 2V బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది 159.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 16.04PS శక్తిని, 13.85Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసందానించారు. ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read:Amit Shah: చిన్ననాటి ముద్దు పేరును బయటపెట్టిన అమిత్ షా
యమహా FZ-FI
ఇది ABS ఫీచర్‌తో వచ్చే చౌకైన మోటార్‌సైకిల్. ఇది స్టన్నింగ్ లుక్స్, సమతుల్య రైడ్ అనుభవంతో వస్తుంది. ఇది 149cc ఎయిర్-కూల్డ్, SOHC, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ తో వస్తుంది. దీనిలో అమర్చిన ఇంజిన్ 12.4 PS శక్తిని, 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. ధర రూ. 1.18 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read:Nandamuri : ‘బాల’ బాబాయ్ తో కలసి నటిస్తాను : కళ్యాణ్ రామ్
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
ABS ఫీచర్‌తో వచ్చే ఈ హీరో బైక్ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 125 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ స్ప్రింట్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 11.55PS శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ధర రూ. 1.01 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read:Air India: ఎయిరిండియాలో విషాదం.. గుండెపోటుతో యువ పైలట్ మృతి
బజాజ్ ప్లాటినా 110
భారత్ లో ABS ఫీచర్‌తో వస్తున్న అత్యంత చౌకైన బైక్ ఇది. ఇది 115.45cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ DTS-i ఇంజిన్ తో వస్తుంది. ఇది 8.6PS శక్తిని, 9.81Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసందానించబడింది. ధర రూ. 71,558 (ఎక్స్-షోరూమ్).