Akhilesh Yadav: ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతుంది.. కోవిషీల్డ్ పై అఖిలేష్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఈ అంశంపై ఇవాళ (బుధవారం) ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. ప్రాణాంతకమైన మందులను అనుమతించడం అంటే ఎవరినైనా హత్య చేయడానికి కుట్ర చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని ఎస్పీ చీఫ్ డిమాండ్ చేశారు. సుమారు 80 కోట్ల మంది భారతీయులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ‘కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారు నుంచి బీజేపీ పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంది అని ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలకు బలవంతంగా ఈ వ్యాక్సిన్ అందించిందని పేర్కొన్నారు.. ఈ విషయంలో బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
కాగా, తాము తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందని బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా కోర్టులో తెలిపింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే బ్రిటన్ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి కోవిషీల్డ్ పేరుతో అమ్మకాలు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఇదేనా మోడీ హామీ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ దేశ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?