Robbery : సినీఫక్కీలో 4లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తు లను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. జూబ్లీహిల్స్కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గౌతమ్ యాదవ్(32) అనే వ్యక్తితో పాటు పని చేస్తున్న యువతి సబ్జా కాలనీలో నివాసం ఉంటుంది. గత నెల 31న రాత్రి 9.30 ప్రాంతంలో ఆమెతో పాటు కారులో తోడుగా వెళ్లిన గౌతమ్ ఆమె ఇంటివద్ద కారు దిగి తన స్నేహితుడి బైక్పై ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే రోడ్డుపై కాపుకాసిన హకీంషా, సమీపంలో నివాసం ఉండే అఫ్రోజాన్(24) అనే ఆటో డ్రైవర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీలుల్లా(20), పారామౌంట్ కాల నీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మదాబాన్(21)లు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎందుకు యువతితో కలిసి వచ్చావంటూ ప్రశ్నించాడు. ఒంటరిగా వస్తున్న స్నేహితురాలిని ఇంటివద్దకు దింపేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది..
Also Read : Pan India: టైగర్ వైస్ డైనోసర్… ఇండియన్ బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉండటంతో దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్న ముగ్గురు నిందితులు బైక్పై అతడిని వెంబడించారు. సుమారు కిలోమీటర్ తర్వాత అంబేద్కర్ నగర్ ప్రాంతానికి రాగానే బైకులతో గౌతమ్ యాదవ్ను అడ్డగించారు. గట్టిగా కేకలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఫ్రోజ్, ఇబ్రహీం, అహ్మద్ ఖాన్లు అక్కడున్న జనాన్ని పోగు చేశారు. దీంతో గంద రగోళం నెలకొంది. దీంతో తన చేతిలో రూ. 4లక్షల నగ దుతో ఉన్న బ్యాగును నిందితులు మాయం చేశారు…
Also Read : Pan India: టైగర్ వైస్ డైనోసర్… ఇండియన్ బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపు లోకి తీసుకుని ప్రశ్నించగా దృష్టి మరల్చి డబ్బులు తస్కరించినట్లు అంగీకరించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్పై గతంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, చైన్స్నాచింగ్స్, మొబైల్ స్నాచింగ్స్ తదితర 10 కేసులు ఉన్నాయి. అహ్మద్ ఖాన్పై హత్యకేసు ఉన్నట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన ఫిలింనగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.2.40లక్షల నగదుతో పాటు 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసిన డబ్బుల్లో కొంత ఖర్చు చేశారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!