Bihar: యువకుడిని చెప్పుదెబ్బ కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కోపంతో ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్‌పూర్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు. తనను ఎందుకు చెప్పుతో కొట్టావని ఆ యువకుడు పదే పదే అడిగాడు. నన్ను చెంపదెబ్బ కొట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. భాగల్‌పూర్ కలెక్టరేట్‌లోని కచారి చౌక్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ట్రాఫిక్‌లో మోహరించిన పోలీసులతో ఓ యువకుడు గొడవకు దిగాడు.
Rs.2000 Notes: రేపే చివరి రోజు.. ఆ తర్వాత 2వేల నోట్లు కనపడవు!
Also Read
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
వివరాల్లోకి వెళ్తే.. యువకుడి బైక్ పై ఉన్న పెండింగ్ చలాన్ల విషయంలో ఈ ఘర్షణకు దారి తీసింది. అతని బైక్ పై చలాన్లు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అమలేష్ కుమార్ దగ్గరకు వచ్చి దుర్భాషలాడాడు. దీంతో కానిస్టేబుల్ ఆ యువకుడిని చెప్పుతో కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవకు దిగి యూనిఫాం చింపేశాడు. ఈ ఘటనలో యువకుడి చొక్కా కూడా చిరిగిపోయింది. అయితే వారిద్దరికి మధ్య జరిగిన గొడవ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Asian Games 2023: షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్కు కాంస్యం
ఈ ఘటనపై సీనియర్ అధికారికి సమాచారం అందడంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బ్రజేష్ కుమార్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాలని ఉందని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ కుమార్ తెలిపారు. అయితే యువకుడిని చెప్పుతో కొట్టడం, పోలీసులతో వాగ్వాదం చేయడం.. యూనిఫాం చింపివేయడం చర్చనీయాంశంగా మారడంతో ట్రాఫిక్ పోలీసుల వ్యవహార శైలిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..