Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avengers Doomsday: ఒకప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు అమెరికా లేదా ఇతర దేశాల్లో విడుదలైన చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ సత్తా ఏంటో హాలీవుడ్ పెద్దలకు చాలా బాగా అర్థమైంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా, ఏకంగా అమెరికా కంటే ఒక రోజు ముందే ‘ఎవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి మార్వెల్ స్టూడియోస్ అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఇచ్చింది. భారతదేశంలో మార్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ నమోదయ్యే కలెక్షన్లు హాలీవుడ్ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి.
అందుకే దీపావళి పండుగ వేళ ఇండియన్ సినీ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్ అందించారు. అసలు ప్లాన్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కావాల్సి ఉండగా, భారత అభిమానుల కోసం సరిగ్గా డిసెంబర్ 17వ తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సరిగ్గా రిలీజ్‌కి 50 రోజుల ముందు ఈ అప్డేట్ ఇచ్చి దేశవ్యాప్తంగా ప్రమోషన్లకు గట్టి పునాది వేశారు. ఇండియన్ మార్కెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పడానికి కేవలం రిలీజ్ డేట్ మార్చడమే కాకుండా.. మార్వెల్ స్టార్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ ఇద్దరూ నేరుగా భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో మెసేజ్ పంచుకున్నారు. మన పండుగను వేదికగా చేసుకుని, ప్రపంచ స్థాయి హీరోలతో స్పెషల్ విషెస్ చెప్పించడం వెనుక ఇండియన్ ఆడియన్స్‌తో కనెక్ట్ కావాలనే మార్వెల్ పక్కా ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
మన దేశంలో మార్వెల్ సినిమాలకు హిందీతో పాటు తెలుగు, తమిళ మార్కెట్లు ఎంతో కీలకంగా మారాయి. అందుకే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి దింపుతున్నారు. మిగతా ప్రపంచం కంటే ముందే భారత్‌లోనే రిలీజ్ అవుతుండటంతో, డిసెంబర్ 17న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు బద్దలవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Diwali just got a whole lot more LIT! 🙌
@RobertDowneyJr & #ChrisEvans have a special festive message for India, along with a dhamakedar tohfa – #AvengersDoomsday now releases a day early in India, on 17th December!
Releasing in English, Hindi, Tamil & Telugu. #50DaysToDoomsday https://t.co/6Nw4g5n7td
— Marvel (@Marvel_India) October 28, 2026
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!