ప్రయాణికులు చైన్ లాగా రైలును ఆపిన సంఘటనలు చాలా వినే ఉంటాం. ఏదైనా అత్యవసరమైతేనే చైన్ లాగుతారు. కానీ ఒక హంస మాత్రం ఎలాంటి సాయం లేకుండా వెళ్తున్న రైలును ఆపింది. ఇదెక్కడి ఆశ్చర్యమని అనుకుంటున్నారా.. ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
Lok Sabha: పీఎం కిసాన్ పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది!
వీడియోలో రైల్వే ట్రాక్ పై ఉన్న హంసను చూసి రైలు ఆగినట్లు ఉండటం చూడొచ్చు. అందులో ఉన్న ప్రయాణికులు సడన్ గా ఆపడంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కానీ తీరా చూస్తే .. ట్రాక్ పై హంస ఉండటం చూసి సైలెంట్ అయిపోయారు. రైల్వే ట్రాక్ పై నుంచి వస్తున్న హంసను చూసి పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దాదాపు 15 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. హంస సుమారు 15 నిమిషాల పాటు పట్టాలపై తిరుగుతూనే ఉంది. అంతసేపు రైలు ఆగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. హంస పట్టాలపై నుండి ఎగిరిపోయే వరకు రైలు కదలలేదు. ఈ ఘటన లండన్ శివారులోని బిషప్ స్టోర్‌ఫోర్డ్ స్టేషన్‌లో జరిగింది. వాస్తవానికి.. లండన్‌లో హంసలకు సంబంధించి ఒక చట్టం ఉంది. హంసలను క్రౌన్ ఆస్తిగా పరిగణిస్తారు. దానివల్ల వాటిని ఎవరూ ముట్టుకోలేరు. దీనిపై క్రౌన్ ప్రిన్స్‌కు మాత్రమే హక్కు ఉంది. ప్రస్తుతం అక్కడ హంసలను ఏ విధంగానైనా హాని చేయడం చట్టవిరుద్ధం.
Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు
ఈ వీడియోను ఓ ప్రయాణికుడు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిని ఇప్పటివరకు 16 లక్షల మంది చూడగా.. 96 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ క్లిప్‌పై ప్రజలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫీస్‌కి ఆలస్యంగా రావడానికి కారణం అడిగితే ఏం చెబుతాను’ అని ఓ వ్యక్తి రాశాడు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.