Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Matka First Look Release : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం పాతకాలం నాటి వైజాగ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే సుదీర్ఘమైన షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ కంప్లీట్ చేసింది. కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు తీయడంతో పాటు నోరా ఫతేహీపై ఓ రెట్రో సాంగ్ షూట్ కూడా పూర్తిచేశారు.
Read Also:Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. రూ. 5 లక్షల రివార్డు
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నోరా ఫతేహీ రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో చాలా అందంగా కనిపించింది. నోరా అద్భుతమైన డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిన సంగతే. మట్కాలోని ఈ రెట్రో సాంగ్ ఆమె డాన్సింగ్ టాలెంట్ ను మరోసారి చూపించబోతోంది. జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫ్ చేశారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథతో వస్తోంది ఈ సినిమా. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన మేకోవర్‌లు చూపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also:Nitin Gadkari: పంజాబ్‌లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ
ఇక ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఒక సరికొత్త మేకోవర్ ని రెడీ చేశారు. ఈ లుక్ పై ఫస్ట్ లుక్ పోస్టర్ ఎపుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ ని రేపు ఆగస్ట్ 11న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి దీనిపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. దీనితో రేపు రానున్న పోస్టర్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!