Site icon NTV Telugu

PM Modi: ఒకే నాణేనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండు ముఖాలు

Modi

Modi

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ కి అసలు దోస్త్ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ను దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలలో ఓడించింది ఎవరని ప్రశ్నించారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని ప్రధాని అన్నారు.

Pakistan: శరణార్థులను కూడా వదలడం లేదు.. ఆఫ్ఘన్లను దోచుకుంటున్న పాకిస్తాన్..

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ప్రధాని విమర్శించారు. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏమీ జరిగింది… ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టేనని అన్నారు. విశ్వసనీయమైన పార్టీ కేవలం బీజేపీనని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి పరంపరను ఆ పార్టీ నుండే వచ్చిన కేసీఆర్ కొనసాగించారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇరిగేషన్ స్కీమ్ ను… ఇరిగేషన్ స్కాం చేశారు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అవమానించాయని చెప్పారు. కాంగ్రెస్ బీసీలను దొంగలనీ అంటుంది… ఆ మాటలు అన్న నేత బెయిల్ పై బయట తిరుగుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుండి బీసీలకు అన్యాయం జరిగింది… బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు.

Perni Nani: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

ఎస్సీ వర్గీకరన పై నిన్న అధికారులతో భేటీ అయ్యనని ప్రధాని మోదీ చెప్పారు. వర్గీకరణ తొందరగా జరిగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చాను… రోడ్ మ్యాప్ రెడీ చేయమని చెప్పానన్నారు. కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గించినా.. కాంగ్రెస్ ప్రభుత్వాలు, కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు కార్బన్ పేపర్ సర్కార్ వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రాజెక్ట్ లు త్వరితగతిన పూర్తి చేయవని అన్నారు. వారికి ప్రాజెక్ట్ ల నుండి జేబులు నిండాలని తెలిపారు. 20 లక్షల మెట్రిక్ టన్నలు బియ్యాన్ని అదనంగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ కుటుంబము కోసం ఆలోచిస్తే బీజేపీ మాత్రమే మీ పిల్లల భవిష్యత్ కోసం పని చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

Exit mobile version