మన సమాజంలో చిత్ర విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. జీవితం అంటే పోరాటం. ప్రతి ప్రాణి ఇతర ప్రాణులపై ఆధారపడి ఉంటుంది. కుక్కను చూస్తే కోళ్ళు, బాతులు పరుగులు పెడతాయి. అయితే ఓ బాతు చూపించిన తెలివి, నటన ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వీడియోలో దృశ్యాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఒక చోట బాతు కిందపడిపోయి ఉంది. తను లేస్తే కుక్క తనని చంపేస్తుంది. అందుకే కిందపడి చనిపోయినట్టుగా యాక్ట్ చేసింది.
Read Also: YS Sharmila: పోలీసులతో వైఎస్ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..
ఆ బాతుని చూసి కుక్క అది నిజమని నమ్మింది. కుక్క అటూ ఇటూ చూస్తా ఉంది. ఆ సమీపంలో ఏదో చప్పుడు వినిపించింది. నిజానికి కుక్కలు ఏదైనా వింత శబ్దాలను బాగా గ్రహిస్తాయి. అక్కడేం జరుగుతుందోనని ఆ కుక్క అటువైపు వెళ్ళింది. అంతే అదే తడవుగా బాతు తన కాళ్ళకి పనిచెప్పింది. అంతకుముందు వరకూ అంగుళం కూడా కదలకుండా పడి ఉంది బాతు. కుక్క అటు వైపు వెళ్ళగానే వేగంగా అక్కడినుంచి పరుగెత్తి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇలాంటి పెర్ ఫార్మెన్స్ కదా కావలసింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఆ బాతు ఏం చేసిందో ఈ వీడియోలో మీరూ ఒక లుక్కెయ్యండి. ఈవీడియోని ట్విట్టర్లో 14 లక్షలమందికి పైగా చూశారు. వేలాదిమంది కామెంట్లు చేశారు.
https://twitter.com/Figensport/status/1650148772213661696