Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898AD: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆదిపురుష్ తో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, మరి ఇంకెన్నో ఆశలు నడుమ ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది.ఇక ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల మీదే అన్నీ ఆశలు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా సలార్, దాని తర్వాత కల్కి2898AD. ఇక సలార్ గురించి పక్కన పెడితే కల్కిపైనే ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. మొట్టమొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడం ఒకటి అయితే కమల్ హాసన్ మొదటి సారి విలన్ గా నటించడం రెండోది. ఇక ఈ రెండు కాకుండా మరో సెన్సేషనల్ విషయం ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ సినిమాలోకి దర్శక ధీరుడు రాజమౌళి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి కల్కి సినిమాలో జాయిన్ అయ్యాడట. కల్కి సెట్ లో జక్కన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడని, షూటింగ్ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది.
Naveen Krishna: విజయ నిర్మల ఆస్తులన్నీ ఆయనకే రాసింది.. మా నాన్నతో ఆస్తి గొడవలు..
Also Read
రాజమౌళి సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడని దర్శకుడిగా, ఆస్కార్ ను ఇండియాకి తీసుకొచ్చిన డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక జక్కన్న చేయి వేస్తే సినిమాకు తిరుగులేదని అభిమానుల అభిప్రాయం. దీంతో కల్కిపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే లేదు కానీ త్వరలోనే మేకర్స్ రాజమౌళి ఆన్ ద బోర్డ్ అని చెప్పనున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కల్కి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టించిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!