NTV Telugu Site icon

Manipur Violence: క్రిస్మస్ వేళ.. కాల్పులతో మరోసారి దద్దరిల్లిన మణిపూర్

Manipur Violence

Manipur Violence

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను ప్రభావిత గ్రామాలకు పంపారు.

READ MORE: Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్‌ఫ్రెండ్‌కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..

మరోవైపు.. చురచంద్‌పూర్ జిల్లాలో భద్రతా దళాలు వంతెన కింద నుంచి 3.6 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇంఫాల్-చురచంద్‌పూర్ రహదారిలోని లీసాంగ్ గ్రామం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పేలుడు పదార్థాలతో పాటు.. డిటోనేటర్లు, కార్డ్‌టెక్స్, ఇతర వస్తువులను బృందం స్వాధీనం చేసుకుంది.

READ MORE: Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ

ఇదిలా ఉండగా.. ఈశాన్య భారతానికి విలువైన ఆభరణంగా వాసికెక్కిన రాష్ట్రం మణిపుర్‌. చూడచక్కని ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ రాష్ట్రం ఇటీవల మళ్లీ అగ్నిగుండంగా మారింది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏళ్లుగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్‌లో హింస మరోసారి పెచ్చుమీరుతోంది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. అప్పటి నుంచి వరసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు జరుపుతున్నారు.

Show comments