జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్డు లేక ఓ పేషెంట్ ను నేలపై డాక్టర్లు పడుకో బెట్టి వైద్యం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాడు.