The Hundred 2025: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్రికెట్ లీగ్ “ది హండ్రెడ్” 2025 టోర్నమెంట్ ముగిసింది. ఆగస్టు 31న జరిగిన ఫైనల్‌లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ మరోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ టైటిల్ సాధించింది. ట్రెంట్ రాకెట్స్ పై గెలిచి వరుసగా మూడోసారి కప్‌ను ఎత్తుకోవడం ద్వారా లీగ్ చరిత్రలో రికార్డ్ సొంతం చేసుకుంది. 2023లో తొలిసారి టైటిల్ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్, 2024లో దానిని విజయవంతంగా డిఫెండ్ చేసింది. ఈ ఏడాది కూడా అదే క్రమాన్ని కొనసాగిస్తూ మూడోసారి వరుసగా ఛాంపియన్‌గా నిలిచింది. రాబోయే సీజన్‌లో జట్టు పేరు మారబోతుందనే వార్తల మధ్య, ఈ విజయ పరంపర జట్టుకు చారిత్రక ఘనతగా నిలిచింది.
ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరఫున విల్ జాక్స్ 41 బంతుల్లో 72 పరుగులు, జోర్డన్ కాక్‌స్ 28 బంతుల్లో 40 పరుగులు చేయడంతో.. వారి ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇక జట్టు నిర్ణిత 100 బంతుల్లో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇక 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ బౌలర్ నాథన్ స్వాట్టర్ 20 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు.
Viral Video: లైక్స్ కోసం మరి ఇంత దిగజారాలా? గొర్రెతో ఆ పనులేంటి గురూ.!
ఈ మ్యాచ్ లో జోర్డన్ కాక్‌స్ రికార్డుల వర్షం కురిపించాడు. 24 ఏళ్ల జోర్డన్ కాక్‌స్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి మొత్తం 7 రికార్డులు తన పేరుతో లిఖించాడు. ది హండ్రెడ్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా (367 రన్స్).. ఇంకా ఈ సీజన్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అలాగే సీజన్ లో అత్యధిక 22 సిక్స్‌లు కొట్టిన రికార్డును, ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక 10 సిక్స్‌లను, ఈ సీజన్‌లో అత్యధిక 50+ పరుగులు (జో రూట్, జానీ బెయిర్‌స్టోతో సమంగా).. అత్యధిక స్కోరు 86 పరుగులుగా, ఇంకా 61.16 బ్యాటింగ్ సగటుతో సీజన్‌లో బెస్ట్ లతో రికార్డులు సృష్టించాడు. ఈ రికార్డులతో కాక్‌స్ మాత్రమే కాకుండా.. ఓవల్ ఇన్విన్సిబుల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టోర్నమెంట్ విజేతగా నిలిచినందుకు ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు £150,000 అంటే సుమారు 1.80 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. అదనంగా టోర్నమెంట్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన జోర్డన్ కాక్‌స్‌కు రూ.6 లక్షల రూపాయలు లభించాయి.
SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!
🏆 3 YEARS IN A ROW! 🏆
Oval Invincibles are 2025 champions! #TheHundredFinal pic.twitter.com/UlHzSpeIQ8
— The Hundred (@thehundred) August 31, 2025