Woman loots: విడిపోయిన తర్వాత ప్రేమలో ఉందని భావించాడు ఆ ప్రియుడు. కానీ ఆ ప్రియురాలి చేసిన పనికి ప్రియుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయాడు. ప్రేమ పేరుతో కొన్ని సంవత్సరాలుగా అతడ్ని వాడుకున్న ఆ మహిళ.. చివరికి ఒంటిమీది బంగారం, బట్టలు కూడా లాగేసుకుని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్రలోని షాహపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు బాలాజీ శివ్‌భగత్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. బాలాజీ శివ్‌భగత్ స్థానికంగా కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయితే అదే షాహపూర్ పట్టణానికి చెందిన 30 ఏళ్ల భావికా బోయిర్ అనే మహిళతో గత కొన్ని సంవత్సరాలుగా బాలాజీకి ప్రేమాయణం సాగుతోంది. అయితే జూన్ 28 వ తేదీన షాహపూర్‌లోని అట్‌గావ్ జాతీయ రహదారి వద్దకు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రావాలని ప్రియుడు బాలాజీకి భావికా సూచించింది. దీంతో ఆ సమయానికి అక్కడికి వెళ్లిన బాలాజీని.. తనతో వచ్చిన మరో నలుగురు వ్యక్తులతో తీవ్రంగా కొట్టించింది. ఆపై అతడు తీసుకువచ్చిన గిఫ్ట్‌లతో పాటు బాలాజీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని.. చివరికి బట్టలు కూడా లాగేసుకుని నగ్నంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిందని పోలీసులకు వివరించాడు.
iQoo Neo 7 Pro: అదిరిపోయిన iQOO నియో 7 ప్రో ఫీచర్స్.. 25 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..!
తీవ్రంగా గాయపడిన బాలాజీ శివభగత్ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను తన ప్రియురాలి కోసం ప్రతిదీ చేసానని తెలిపాడు. అంతేకాకుండా ఇల్లు కూడా కట్టించాను. అప్పుడప్పుడూ తన కోసం రకరకాల బహుమతులు తెచ్చేవాడినని పేర్కొన్నాడు. తాను అడిగిన ప్రతిదీ ఇచ్చేవాడినని.. కానీ తనను కాదని మరొక వ్యక్తి కోసం ఇలా దోచుకోవడం.. అంతేకాకుండా నిర్దాక్షిణ్యంగా కొట్టించిందని తెలిపాడు. అనంతరం మరుసటి తెల్లవారుజామున.. షాహపూర్ జాతీయ రహదారిపై పడేశారని తెలిపాడు. ఆ సమయంలో తన మెడలో ఉన్న 2 బంగారు గొలుసులు, చేతులకు ఉన్న 7 బంగారు ఉంగరాలు తీసుకుని.. తన బట్టలు కూడా తీసుకుని.. నగ్నంగా పడేసి వెళ్లారని చెప్పాడు. తాను నగ్నంగా ఉన్నపుడు భావికా వీడియో తీసిందని.. వెళ్తూ వెళ్తూ తన కళ్లలో కారం చల్లి పోయినట్లు చెప్పాడు.
DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
కొద్ది సమయం తర్వాత తాను కొంత కోలుకుని.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అనంతరం తన స్నేహితులకు ఫోన్ చేయగా.. వారు వచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నాడు. బాధితుడు బాలాజీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు భావికా బోయిర్, నదీమ్ ఖాన్‌ల పేర్లను మాత్రమే గుర్తించగా.. మరో ముగ్గురు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.