Anu Emmanuel: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. తాజాగా మీడియా ముందుకు వచ్చి “ది గర్ల్ ఫ్రెండ్”లో దుర్గ క్యారెక్టర్ లో నటించిన ఎక్సిపిరీయన్స్ తెలిపారు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను ఏమో అన్నారు. నేను తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు కానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి మూవీస్ ను సంతృప్తి కోసం, ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశాను.
READ ALSO: Delhi Car Blast: ‘‘యాక్ట్ ఆఫ్ వార్’’.. ఆపరేషన్ సిందూర్ మళ్లీ మొదలు?