ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా.. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులగా వస్తున్న రూమర్లకు ఇవాళ్టితో తెరపడింది. వీరి ప్రేమ వ్యవహారం త్వరలోనే వివాహ బంధంగా మారనుంది. ఇందులో భాగంగా ఇవాళ ( శనివారం ) సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
Also Read : Karnataka: సీఎం పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా..
ఇరువురి ( పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ) కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపు 150 మంది అతిథుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకుని తమ వైవాహిక బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను రాఘవ్ చద్దా.. పరిణీతి చోప్రా ఇద్దరూ తమ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లలో షేర్ చేసుకున్నారు. దీంతో త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ జంట సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read : Mallikarjun Kharge: కర్ణాటక తీర్పుతో “బీజేపీ ముక్త్-సౌత్ ఇండియా” అయింది..
ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, పరిణీతి సోదరి సినీనటి ప్రియాంక చోప్రా జోనాస్, కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం, శివసేన ( యూబీటీ ) నేత ఆదిత్య ఠాక్రే, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రియాంక చోప్రా ఈ రోజు ఉదయమే అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు.
Also Read : ప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశాలు..
ఈ నిశ్చితార్థ వేడుకల్లో ప్రియాంక చోప్రా తాళుక్కున మెరిసింది. పసుపురంగు చీరల మెరిశాడు. నిశ్చితార్థ వేడుక సందర్భంగా ముంబయిలో పరిణీతి చోప్రా నివాసం.. ఢిల్లీలోని రాఘవ్ చద్దా ప్రభుత్వ భవనాలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలు.. పూలతో అలంకరించారు. ఈ జంట ఒక్కటవుతుండటంతో విమర్శకుల నోట్లకు తాళం వేసినట్లు అయింది.
Everything I prayed for .. She said yes! 💍
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਮਿਹਰ ਕਰਨ। 🙏🏻 pic.twitter.com/OquwJwHTDL— Raghav Chadha (@raghav_chadha) May 13, 2023