BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
- వివాదంగా మారిన కాంగ్రెస్ ‘‘భారత్ సమ్మిట్’’ కార్యక్రమం..
- ఇటలీకి చెందిన నేత భారత అంతర్గత విషయాల్లో జోక్యంపై బీజేపీ ఫైర్..
- విదేశీ నేత వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ నవ్వడంపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘‘భారత్ సమ్మిట్’’ వివాదానికి కేంద్రంగా మారింది. ఇటలీకి చెందిన రాజకీయ నేత జియాకోమో ఫిలిబెక్ కాంగ్రెస్ పార్టీ నినాదం ‘‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’’ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఈ సమయంలో వేదికపై ఉన్న రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు నవ్వుతూ కనిపించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. భారత అంతర్గత విషయాల్లో విదేశీ రాజకీయ ప్రతినిధులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది.
పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్ అయిన జియాకోమో ఫిలిబెక్.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ రాహుల్ గాంధీ చాలాకాలంగా చేస్తున్న ఆరోపణల్ని పునరావృతం చేశారు. కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే రాజకీయ పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ భావజాల ప్రతినిధులతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించింది.
Also Read
- Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
- Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
- Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
- Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
రాహుల్ గాంధీ నవ్వులపై కిరణ్ రిజిజు ఫైర్..
ఇటలీ నేత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక విదేశీయుడు భారతదేశాన్ని అవమానిస్తున్నప్పుడు ఎవరైనా నవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? భారతదేశాన్ని అవమానించేందుకు విదేశాలకు వెళ్లే భారతీయుల గురించి నేను మాట్లాడటం లేదు’’ అంటూ పోస్ట్ చేశారు.
మరోవైపు, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమంపై విమర్శలు చేశారు. దేశంలో, విదేశాల్లో వామపక్ష భావజాల ప్రచారకులను కాంగ్రెస్ ఆహ్వానించిందని, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
VIDEO | Hyderabad: At the Bharat Summit, Secretary General of the Party of European Socialists, Giacomo Filibeck said, "Rahul Gandhi has defended a simple principle on which every democracy rests; ‘one person, one vote’. His campaign for clean and transparent voter rolls and the thousands who marched with him to Ramlila Maidan just two weeks ago remind us that democracy is not given. It is defended by people willing to stand up for it. ‘Vote Chor Gaddi Chhod’. The Congress Party built the democratic foundation of modern India."
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 15, 2026
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
-
BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!