NTV Telugu Site icon

Thatikonda Rajaiah : కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది…

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వం, అందుకే కేటీఆర్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. కేటీఆర్ పై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు తాటికొండ రాజయ్య. కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయిందని, పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు,హైట్రిక్ సాధించాడన్నారు తాటికొండ రాజయ్య. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం అని ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ కు ఎవరు చేయని నమ్మకద్రోహం చేసి 100 కోట్లకు అమ్ముడు పోయినా నికృష్టుడు కడియం శ్రీహరి అని, తాత ముత్తాతల నుండి ఆస్తి పరులైన కేసీఆర్, కేటీఆర్ పై కడియం శ్రీహరి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడన్నారు.

IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్

అంతేకాకుండా..’కడియం శ్రీహరి భారత్ నుండి మలేషియా,సింగపూర్ కు హవాలా ద్వారా డబ్బులు పాపించి తన కూతురు అల్లుడు ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారు… కడియం శ్రీహరి 1995లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతిపై కల్నాయకని ఒక పుస్తకం వచ్చింది… 1992లో రాజకీయాలకు వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు మీ ఆస్తి ఎంత… అప్పుడు గచ్చు నేలతో ఉన్న నీ ఇల్లు ఇప్పుడు 10 కోట్లతో హనుమకొండ నడి బొడ్డున ఎలా వచ్చింది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడానికి కడియం శ్రీహరి సూత్రధారిగా అవుతాడు… స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్రహింసలకు గురి చేస్తుంటే వాళ్లు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు… నిన్ను గెలిపించిన ప్రజలకు మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి… నీకు సిగ్గు శరం ఉంటే టిఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి… స్టేషన్ ఘనపూర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు… కేసీఆర్ కేటీఆర్ పై విమర్శలు చేస్తే ఖబర్దార్… టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్ను స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారు.’ అని తాటికొండ రాజయ్య అన్నారు.

Kolkata: ఆలస్యం కావడంతో బుకింగ్‌ క్యాన్సిల్ చేసిన మహిళ..అసభ్యకర వీడియోలు పంపిన డ్రైవర్

Show comments