బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఫంక్షన్స్ లో కనిపించడం కానీ జరగలేదు. దీంతో బీ టౌన్లో అలాగే ఆమె అభిమానుల్లో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.. అయితే, ఎట్టకేలకు ఆ విషయంపై రష్మిక స్పందించారు. ఇన్ స్టా పోస్ట్ ద్వారా ఆమె సమాధానం చెప్పారు.
‘‘ఎస్.. ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్.. నేను ఎందుకు ‘యానిమల్’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయడం లేదు అని. నాకు తెలుసు ఇవి ప్రేమ, అభిమానం వల్లే వస్తున్నాయి. యానిమల్ టీమ్ అందించిన భారీ చిత్రాన్ని ప్రజలు ఆనందించారు, ఆదరించారు, ప్రశంసలు కురిపించారు. ఆ విజయాన్ని నేను ఆస్వాదించాలని అనుకున్నాను. టైం కేటాయించాలి అనుకున్నాను. కానీ, ఆ సినిమా విడులైన మరుసటి రోజు నుంచే నేను వేరే సినిమా షూట్ కి వెళ్లాల్సి వచ్చింది. అది నా కెరీర్ లోనే చాలా ముఖ్యమైన, పెద్ద ప్రాజెక్ట్. ఇంటర్వ్యూలలో,సక్సెస్ పార్టీల్లో కూడా నేను పాల్గొనలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్ కోసం రాత్రిళ్లు కూడా నేను ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల ద్వారా భర్తీ చేస్తానని భావిస్తున్నా. అవి మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని ఇన్ స్టాలో రష్మిక పోస్ట్ పెట్టారు.