టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో అక్కినేని నాగచైతన్య -చందూ మొండేటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచాయి..తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది.ఆ మూవీనే తండేల్..రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు.NC23 గా వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాయిపల్లవి నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చైతూ మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి తాజాగా అప్‌డేట్ బయటకు వచ్చింది. లైట్స్ ఆన్..స్టార్ట్ కెమెరా..యాక్షన్ అంటూ తండేల్ షూటింగ్ మొదలుపెట్టేసింది చైతూ టీం.తండేల్ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. నాగచైతన్య మరియు ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
లవ్‌స్టోరీ సినిమా తర్వాత చైతూ, సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో తండేల్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే తెలంగాణ యాసలో వినోదాన్ని పంచిన సాయిపల్లవి.. ఈ సారి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్ గాళ్‌గా ఎంతలా అలరిస్తుందనేది చూడాలి మరి.2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. తండేల్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూమొండేటి నుంచి వస్తున్న సినిమా కావడం అలాగే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
#Thandel Shoot in progress 🌊⚓
Exciting updates soon 💥#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/F2kQlGA2Hz
— ᴋ ʀ ʀ ɪ ꜱ ʜ (@Balaram_Raju) December 26, 2023