ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని,…