అగ్ర రాజ్యం అమెరికాలో జరిగిన వరుస ఉగ్ర దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఓర్లీన్స్‌లో ఓ ట్రక్కు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి గాయాలయ్యాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే నిందితుడిని పోలీసులు తుదిముట్టించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. ప్రధాని మోడీతో సహా ఆయా దేశాధినేతలు ఉగ్ర దాడిని ఖండించారు.
ఇక రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేపట్టింది. నిందితుడు షంసుద్-దిన్ జబ్బార్(42)గా గుర్తించారు. టెక్సాస్‌కు చెందిన అమెరికన్ పౌరుడు జబ్బార్‌గా కనిపెట్టారు. ఇక దాడికి ముందు కొన్ని గంటల ముందు ఫేస్‌బుక్‌లో ఐదు వీడియోలను పోస్టు చేశాడు. ఇందులో అతడు చేయబోయే హింసను గూర్చి పేర్కొన్నాడు. ఇక ట్రక్కుపై ఐసిసి జెండా ముద్రించి ఉంది. దీంతో ఇతడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా పేర్కొ్న్నారు. ఇక పోలీసులు.. నిందితుడి ఇల్లును సోదాలు చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఇంట్లో బాంబు తయారీ సామగ్రితో పాటు ఖురాన్ బుక్ తెరిచి ఉంది. ఈ పేజీలో ‘బలిదానం’ అనే మాటలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా అతడి గది నిండా ఇస్లాంకు చెందిన అనేక పుస్తకాలు ఉన్నాయి. సమీపంలో ప్రార్థన రగ్గు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తెరిచి ఉన్న ఖురాన్‌లో ‘‘వారు అల్లాహ్ పక్షాన పోరాడతారు. చంపుతారు, చంపబడ్డారు.’’ అని ఒక వాగ్దానం ఉంది. హింసను సమర్థించుకోవడానికి ఈ వచనాన్నే ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఉన్న షెల్ఫ్ నిండా ఇస్లాంకు చెందిన పుస్తకాలే ఉన్నాయి. ఇక పడకగదిలో పిల్లల బొమ్మలు, బంక్ బెడ్‌లు కనిపించాయి. ఇక జబ్బార్ అద్దెకు తీసుకున్న ట్రక్కుపై ఐఎస్ఐఎస్ జెండా కనిపించింది.
జబ్బార్.. 2007లో ఆర్మీలో చేరాడు. మానవ వనరులు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో యాక్టివ్ డ్యూటీలో పనిచేశాడు. ఇక 2009 నుంచి 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసినట్లు తెలుస్తోంది. 2015లో ఆర్మీ రిజర్వ్‌కు బదిలీ అయ్యాడు. 2020లో స్టాఫ్ సార్జెంట్ హోదాతో నిష్క్రమించాడు.
ఇది పూర్తిగా ఉగ్రవాద చర్య అని ఉగ్రవాద నిరోధక విభాగం డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ రైయా పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడినట్లుగా తెలిపారు. జబ్బార్.. ఇస్లామిక్ స్టేట్ నుంచి 100 శాతం స్ఫూర్తి పొందాడని వెల్లడించారు. యూఎస్ గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన ఐసిసి ప్రేరేపిత దాడిగా చెప్పారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాద ముప్పుగా పేర్కొన్నారు.
🚨 WATCH: Tour of New Orleans Attacker Jabbar’s home
The NYP reporter says she “found a bomb-making station and a Quran open to a chilling passage about martyrdom”
Something’s off here. The attack happened literally YESTERDAY
How is this being allowed?
pic.twitter.com/vCwCrpf0b8— Nick Sortor (@nicksortor) January 3, 2025