బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం…