బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా…
తెలంగాణలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాల పై ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీజిఓ, టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. సీనియారిటీ లిస్ట్ తయారు, ఉద్యోగుల కేటాయింపు పై చర్చ జరిగింది. రేపటి వరకు సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు సీఎస్. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కేటాయించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. భార్య భర్తలకు ఒకే దగ్గర…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్‌ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ…