TG Cabinet Meeting : ఈనెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అయితే.. ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
రైతు రుణమాఫీ కి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!