పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
READ MORE: Kerala High Court: “జానకి” ఉంటే తప్పేంటి.. అనుపమ పరమేశ్వరన్ సినిమాపై వివాదం..
నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆదేశ సైన్యం, ప్రభుత్వం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల బహవల్పూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ శిబిరాలను తిరిగి స్థాపించాలని నిర్ణయించారు. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, టీఆర్‌ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లతో పాటు పాక్ సైన్యం, ఐఎస్‌ఐ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
READ MORE: Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!
నిఘా సంస్థల సమాచారం ప్రకారం.. ఈసారి ఉగ్రవాద శిబిరాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అమర్చనున్నారు. తద్వారా భారత నిఘా సంస్థలు వాటిని చేరుకోవడం కష్ట తరంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ శిబిరాల భద్రతా బాధ్యతను పాకిస్థాన్ సైన్యంలోని ప్రత్యేక భద్రతా గార్డులకు అప్పగించారు. వారు డ్రోన్లు, థర్మల్ సెన్సార్లు, నైట్ విజన్ కెమెరాలు వంటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. ఈసారి ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ఇప్పుడు ఒక శిబిరంలో 200 కంటే తక్కువ మంది ఉగ్రవాదులను ఉంచుతారట. భారతీయ ఏజెన్సీలకు ట్రాక్ చేయడం కష్టతరం అయ్యేలా అనేక చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే, ఉగ్రవాదులను వెంటనే సరిహద్దు వైపు పంపుతారు.
READ MORE: Gujarat High Court: టాయిలెట్‌లో కూర్చుని వర్చువల్ విచారణకు హాజరైన యువకుడు.. వీడియో వైరల్
ఈ సమాచారం అందిన తర్వాత, భారత భద్రతా సంస్థలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో కార్యకలాపాలపై తమ పర్యవేక్షణను మరింత ముమ్మరం చేశాయి. సైన్యం, నిఘా సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. పీఓకేలో ఈ స్థావరాలను తిరిగి ఏర్పాటు చేస్తున్న వారిపై ఉపగ్రహ చిత్రాలు, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెంచారు. కాగా.. ఆపరేషన్ సింధూర్ కింద భారత భద్రతా సంస్థలు పాకిస్థాన్‌లోని అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేశాయి. వాటిలో లూని, పుత్వాల్, భైరోనాథ్, పిపి ధన్‌ధర్, టిప్పు, ముంతాజ్ కాంప్లెక్స్, జమీల్, సైధ్వాలి, ఉమ్రాన్‌వాలి బంకర్, చాప్రార్ ఫార్వర్డ్, చోటా చక్ పోస్ట్, అఫ్జల్ షహీద్ పోస్ట్, జంగ్లోరా పోస్ట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రదేశాలన్నింటిలోనూ వాటిని కొత్త మార్గాల్లో తిరిగి సిద్ధం చేసే కసరత్తు ప్రారంభమైంది.
